విమానంలో ‘అడల్ట్ ఎంటర్టైన్‌మెంట్’.. లోదుస్తులు లేకుండా.. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌ను కుదిపేస్తున్న వివాదం…

విమాన ప్రయాణంలో ‘అడల్ట్ ఎంటర్టైన్‌మెంట్’… ఇప్పుడిదే వివాదం బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌ను కుదిపేస్తోంది. ఆ సంస్థలో పనిచేసే ఓ ఎయిర్ హోస్టెస్ తన వృత్తిని అడ్డుపెట్టుకుని వ్యభిచార కార్యకలాపాలకు సిద్దపడింది. విమాన ప్రయాణికులకు ఆ సేవలు అందించేందుకు తాను సిద్దమని… స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. అంతేకాదు,తన లోదుస్తులను కూడా ఆమె ప్రయాణికులకు విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గుర్తు తెలియని ఆ ఎయిర్ హోస్టెస్‌ కోసం బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ అంతర్గత విచారణ చేపట్టింది. విమానంలో లోదుస్తులు కూడా ధరించనని… విమానంలో లోదుస్తులు కూడా ధరించనని… ‘విమాన ప్రయాణంలో మీకు అడల్ట్ ఎంటర్టైన్‌మెంట్ కావాలా… అయితే నాకు కొంత డబ్బులివ్వండి. మీకు నచ్చిన, భిన్నమైన అనుభవాన్ని నేను అందజేస్తాను.’ అని సదరు ఎయిర్ హోస్టెస్ తన బ్లాగ్‌లో పేర్కొన్నట్లు బ్రిటీష్ ఎయిర్‌వేస్ అధికారులు పేర్కొన్నారు. శృంగారపరంగా రెచ్చగొట్టే రీతిలో ఉన్న పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విమాన ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అంతేకాదు,విమానంలో లోదుస్తులు కూడా ధరించనని ఆమె తన పోస్టుల్లో పేర్కొన్నట్లు అధికారులు గుర్తించారు. ఏకాంతంగా కలవాలనుకుంటే ప్రత్యేక చార్జీలు.. ఏకాంతంగా కలవాలనుకుంటే ప్రత్యేక చార్జీలు.. ఈ వ్యవహారంపై ప్రముఖ మీడియా ‘ది సన్’ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. తమ ఇన్వేస్టిగేటివ్ రిపోర్టర్ జరిపిన విచారణలో వెల్లడైన విషయాలను బయటపెట్టింది. ఆ ఎయిర్ హోస్టెస్ 25 పౌండ్లకు(రూ.2471) విమానంలో తన లోదుస్తులను కూడా విక్రయించినట్లు తెలిపింది. ఒకవేళ ఏకాంతంగా ఆమెను హోటల్ గదిలో కలవాలనుకుంటే.. అందుకోసం ప్రత్యేక చార్జీలు వర్తిస్తాయని ఆమె చెప్పినట్లుగా పేర్కొంది. తన వ్యభిచార కార్యకలాపాల కోసం లండన్‌లో ఓ హోటల్ రూమ్‌ను కూడా బుక్ చేసినట్లు తెలిపింది.ఈ మొత్తం వ్యవహారంపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… ‘మా సహోద్యోగుల నుంచి అత్యున్నత ప్రవర్తనను మేము ఆశిస్తాం. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నాం.’ అని తెలిపారు.

పోస్టులు తొలగించిన హోస్టెస్..
బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఈ వ్యవహారాన్ని గుర్తించడం… దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించడంతో… సదరు ఎయిర్ హోస్టెస్ తన సోషల్ మీడియా ఖాతాలో,బ్లాగ్‌లో పెట్టిన పోస్టులను తొలగించింది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌‌ను ఉపయోగించుకుని ఆమె వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో దిగిన ఫోటోలతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆమె ప్రయత్నించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతు ప్రకటించినట్లు ప్రముఖ మీడియా న్యూయార్క్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొనడం గమనార్హం. ఆమెను సేఫ్‌గా ఉండమని వారు కోరుతున్నట్లు సదరు కథనం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares