వుహాన్ ల్యాబ్‌లో కరోనా సృష్టి: ఆ పాపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకూ భాగం: చైనా వైరాలజిస్ట్ మరో బాంబు

వాషింగ్టన్: జనం ప్రాణాలను పీల్చి పిప్పి చేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన చైనా వైరాలజిస్ట్ తాజాగా మరో బాంబు పేల్చారు. వుహాన్‌లో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న ఓ ల్యాబొరేటరీలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిందని, దాన్ని కృత్రిమంగా తయారు చేశారని హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పూర్వ విద్యార్థిని, వైరాలజీ అండ్ ఇమ్యునాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ లీ-మెంగ్ యాన్ ఇదివరకే వెల్లడించారు. తాజాగా- ఈ పాపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భాగం ఉందని తేల్చి చెప్పారు. చైనా చేసిన తప్పులను డబ్ల్యూహెచ్ఓ కప్పి పుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. షారుఖ్ ఖాన్ టీమ్‌కు మాత్రమే: స్పెషల్ ట్రీట్‌మెంట్: బుర్జ్ ఖలీఫాపై కేకేఆర్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చైనా బండారాన్ని డబ్ల్యూహెచ్ఓ కప్పి పుచ్చింది.. భారత్‌కు చెందిన ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ వియాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. వుహాన్‌లోని ప్రభుత్వ ల్యాబొరేటరీలో కరోనా వైరస్‌ను కృత్రిమంగా సృష్టించడం ఒక ఎత్తయితే.. దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం మరో ఎత్తు అని పేర్కొన్నారు. వైరస్ పుట్టుకొచ్చిందనే విషయం ప్రపంచానికి తెలియడానికి ముందే డబ్ల్యూహెచ్ఓకు తెలుసి ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దాన్ని కప్పి పుచ్చడానికి విఫల ప్రయత్నాలు చేసిందని లీ-మెంగ్ యాన్ చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ తన పరిధికి మించి.. ప్రాణాలను తీసే శక్తిసామర్థ్యాలు ఉన్న, అత్యంత శక్తిమంతమైన ఈ వైరస్ తయారీ విషయంలో చైనాపై మచ్చపడకుండా డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నించిందని చెప్పారు. చైనాను కాపాడే ప్రయత్నంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన పరిధికి మించి వ్యవహరించిందని తాను భావిస్తున్నట్లు లీ-మెంగ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనాను వెనకేసుకునేంత అవసరం ఏమొచ్చిందనే అంశంపై ఆరా తీయాల్సి ఉందని చెప్పారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా పుట్టుకొచ్చిందన విషయాన్ని తన సూపర్ వైజర్‌కు తెలిపానని, అక్కడి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అన్నారు. డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుండటం వల్లే స్పందించలేదని చెప్పారు. చైనాకు ఎందుకంత అవసరం? కరోనా వైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న కట్టడి చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని చెప్పారు. దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఆలస్యంగా స్పందించిందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వుహాన్ ల్యాబొరేటరీలో వైరస్ కృత్రిమంగా సృష్టించారనడానికి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, వాటిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందనీ చెప్పారు. ఈ విషయం బయటికి వచ్చిన తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయని, తన కుటుంబంపై సైబర్ దాడులను నిర్వహిస్తామంటూ హెచ్చరించారని అన్నారు.
ఫిష్ మార్కెట్‌లో పుట్టుకొచ్చిందనే వార్తలను కొట్టేసిన లీ.. వూహాన్‌లోని ఫిష్ మార్కెట్ నుంచి వైరస్ పుట్టుకొచ్చిందనడం పూర్తిగా అవాస్తవమని లీ-మెంగ్ తెలిపారు. చైనా ప్రభుత్వ ఆధీనంలోన పనిచేస్తోన్న వుహాన్‌లోని లాబొరేటరీలో వైరస్‌ను కృత్రిమంగా తయా చేశారంటూ బ్రిటీష్ టీవీ టాక్‌షోలో ఆమె వెల్లడించారు. తన వద్ద ఉన్న ఆధారాలతో వైరస్ ల్యాబ్ నుంచే వచ్చిందని చెప్పడానికి ప్రయత్నించానని, చైనా ప్రభుత్వం తనను బెదిరించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం తనను ఏం చేస్తుందోననే భయాందోళనలతో హాంకాంగ్‌ను వీడానని, ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నానని ఆమె వియాన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares