వైసీపీకి ఇదే చివరి ఛాన్స్.. చంద్రబాబు


ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ బాధ్యతగా పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. టీడీపీ తీసుకున్న బాధ్యతలో, పదోవంతు వైసీపీ తీసుకున్నా రాష్ట్రంలో ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు.
: వైసీపీకి ఇదే చివరి ఛాన్స్.. వాళ్లంతా జగన్‌కు కమిషన్ ఏజెంట్లన్న చంద్రబాబు

సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలు..చేసేవన్నీ తప్పుడు పనులని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దాడులు,దౌర్జన్యాలు..ఎక్కడ చూసినా హింసా విధ్వంసాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇంతగా బరితెగించిన పార్టీని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో కరోనా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన టిడిపి నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఒక్క ఛాన్స్ అని బతిమాలితే అధికారం ఇచ్చారని అన్నారు. పదేపదే తప్పుడు పనులకు పాల్పడ్డారని.. ఇదే వైసిపికి చివరి ఛాన్స్‌గా చేసుకున్నారని విమర్శించారు.

ఈ పరిస్థితుల్లో టిడిపిపై చారిత్రకమైన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. అటు రాష్ట్ర అభివృద్ది, ఇటు పేదల సంక్షేమం కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైసీపీ బాధితులకు అండగా ఉండాలని… రైతులు, మహిళలు, యువత, బలహీనవర్గాల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు కోరారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను, హింసా విధ్వంసాలను ఎక్కడికక్కడ నిరసించాలని చంద్రబాబు సూచించారు. అన్యాయానికి గురైనవారికి అండగా ఉండాలని అన్నారు. దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాలలో 5 జిల్లాలు ఏపిలో ఉంటే, అందులో ప్రకాశం జిల్లా ఒకటి కావడం బాధాకరమని అన్నారు.

ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ బాధ్యతగా పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. టీడీపీ తీసుకున్న బాధ్యతలో, పదోవంతు వైసీపీ తీసుకున్నా రాష్ట్రంలో ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. టీడీపీ ప్రభుత్వమే మళ్లీ వచ్చివుంటే వెలిగొండ ప్రాజెక్టు ఈ పాటికి పూర్తయ్యేదన్నారు. ఏడాదిన్నరలో వైసీపీ రాష్ట్రానికి చేసింది శూన్యమని చంద్రబాబు ఆరోపించారు. ఏడాదికి రూ. 13వేల కోట్లు నీటిపారుదలపై టిడిపి ఖర్చుచేస్తే, అందులో 3వ వంతు కూడా వైసీపీ ఖర్చు చేయలేదని అన్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేశారని విమర్శించారు. ప్రతిపక్షాల నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, ఆర్ధిక మూలాలు దెబ్బతీయడం, అక్రమ నిర్బంధాలు, .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవని అన్నారు. సీఎం జగన్‌కు కమిషన్ ఏజెంట్లుగా మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు మారారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేశారని… వాటి పేర్లు మార్చారే తప్ప, వైసీపీ కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0