వైసీపీ ప్రభుత్వ దుశ్శాసన పర్వం: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

రాష్ట్రంలో దమననీతి సాగుతోందని, దళితులు, మహిళలు, రైతులపై నిత్యందాడులు జరుగుతున్నాయని, దళిత మేథావులను హింసిస్తున్నారని, దళితయువకులకు శిరోముండనాలు
చేయించారని, మహిళలపై అత్యాచారాలు, రైతులపై జరుగుతున్న దాడుల్లో ప్రభుత్వదమననీతి స్పష్టంగా కనిపిస్తోందని తెలుగురైతు రాష్ట్ర విభాగం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా కౌంటర్ ఉద్యమాన్ని సృష్టించిందని, పెయిడ్ ఆర్టిస్ట్ లను ప్రశ్నించిన నేరానికి రాజధానిప్రాంత దళితరైతులపై తెలివిఎక్కువైన మంగళగిరి డీఎస్పీ అట్రాసిటీ కేసు పెట్టించారన్నారు.

ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసు పెట్టడమనేది
ఈ ప్రభుత్వానికి మాయని మచ్చఅని, ఇటువంటి ఉదంతాలే ముక్కున వేలేసుకొనేలా చేస్తున్నాయన్నారు. రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టి, వారి చేతులకు బేడీలు వేసి తీవ్రంగా అవమానించారన్నారు.

రాజధాని రైతులు, మహిళలు జైల్ భరో కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తుంటే, మహిళలపై
దాడిచేయించడం, మగపోలీసులే ఆడవాళ్లపై అమానుషంగా ప్రవర్తించడం, దౌర్జన్యం చేయడం వైసీపీప్రభుత్వ దుశ్వాసన పర్వమేనని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు. దమనకాండకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వ తీరుపై ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు. రాష్ట్ర మంత్రులు పలుసందర్భాల్లో రైతులను, దళితులను, మహిళలను కించపరిచేలా మాట్లాడారన్నారు.

రైతులను ల….కొడుకులని, వారు మంచిబట్టలు వేసుకోకూడదు, విమానాల్లో ప్రయాణించకూడదనే సంకుచిత, ఫ్యూడల్ మనస్తత్వం మంత్రుల్లో ఉందన్నారు. రాజధాని ఉద్యమా న్ని నీరుగార్చడానికి జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, అందులోభాగంగానే రైతులకు బేడీలు వేశారన్నారు.

దుర్మార్గంగా పాలన చేసినవారంతా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారని, జగన్ ప్రభుత్వానికి కూడా త్వరలో అదేగతి పడుతుందన్నారు. రైతులు, మహిళల ఉసురు జగన్ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందన్నారు.

వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అమరావతి రైతులపై కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు.

పోలవరం నిర్మాణాన్ని తనస్వార్థప్రయోజనాల కోసం కేంద్రానికి తాకట్టుపెట్టిన జగన్ తీరుపై ప్రజల్లోచర్చ జరగకూడదన్న దురాలోచనతోనే ప్రభుత్వం రైతులపై దమనకాండ కు పాల్పడుతోందని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.

వైసీపీప్రభుత్వం ఇప్పటికైనా విధానాలు మార్చుకొని, రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, జగన్మోహన్ రెడ్డి రైతులకు, మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0