శౌర్య క్షిపణి ప్రయోగం సక్సెస్: కొత్త వెర్షన్‌తో ప్రయోగం, 800 కి.మీ లక్ష్యం

భారత రక్షణరంగంలో మరిన్ని అస్త్రాలు చేరుతున్నాయి. ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ని డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసింది. అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్థ్యం వున్న శౌర్య మిస్సైల్‌ని డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి శనివారం జరిపిన శౌర్య క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. శౌర్య క్షిపణి భూతలం నుంచి భూతలంపై 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. శౌర్య క్షిపణిని గతంలోనే రూపొందించగా.. తాజాగా మరింత ఆధునీకరించారు. కొత్త వెర్షన్‌ను ప్రయోగించి పరీక్షించారు. అత్యంత తేలికైన క్షిపణిని.. ప్రయోగించడం కూడా తేలిక అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యూహాత్మక క్షిపణుల తయారీలో పూర్తి స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఆత్మ నిర్భర్ భారత్ స్పూర్తితో ప్రయోగిస్తున్నారు. ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని డీఆర్డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా చేధించగలదు. డీఆర్డీవో చేపట్టిన పీజే-10 ప్రాజెక్టు కింద ఈ పరీక్షను నిర్వహించారు. దేశీయంగా రూపొందిందిన బూస్టర్‌తో బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేశారు.