సొరకాయ రూ.కోటి అంట, జనాల్ని పిచ్చోళ్లని చేసి అమ్మేశారు..


మామూలు సొరకాయలను కూడా లక్షలు పెట్టి కొనడానికి భక్తులు ఎందుకు ఎగబడతారు? ఎగబడరు. కానీ, ఈ సొరకాయలో ఉండే ఒకే ఒక్క స్పెషాలిటీ ఏంటంటే, అవి నాగస్వరంలా ఉంటాయి.
సొరకాయ రూ.కోటి అంట, జనాల్ని పిచ్చోళ్లని చేసి అమ్మేశారు..

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం కూడా ఒకటి. ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకాలను క్యాష్ చేసుకుని కేవలం రూ.10 కూడా పలకని సొరకాలను ఏకంగా లక్షలు, కోట్ల రూపాయలకు అంటగట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంటి వారిలో 21 మందిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సొరకాయలకు మహిమలు ఉన్నాయంటూ నమ్మించి భక్తులకు శఠగోపం పెడుతున్నారు. వారంతా ఓ ఆశ్రమంలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మామూలుగా దొరికే సొరకాయలను తాము ఒక్కొక్కటి లక్షల రూపాయలకు అమ్మినట్టు నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు.

మామూలు సొరకాయలను కూడా లక్షలు పెట్టి కొనడానికి భక్తులు ఎందుకు ఎగబడతారు? ఎగబడరు. కానీ, ఈ సొరకాయలో ఉండే ఒకే ఒక్క స్పెషాలిటీ ఏంటంటే, అవి నాగస్వరంలా ఉంటాయి. అంటే పాములను ఆడించే వాళ్ల దగ్గర ఉండే బూరల్లా ఉంటాయి. వీటిని నాగ సొరకాయలు అంటారు. ఇవి ఎక్కడపడితే అక్కడ పండేవి కావని, కేవలం శ్రీశైలం మల్లికార్జునుడు కొలువైన నల్లమల అడవుల్లో మాత్రమే లభిస్తాయంటూ వారు భక్తులను నమ్మిస్తారు. ఫలానా వాళ్లు కొన్నారు, ఆ ఊరి వాళ్లు కొన్నారు. ఈ ఊరి వాళ్లు కొన్నారు. ఈ సొరకాయ ఇంట్లో ఉంటే ఎంతో మంచిది. అంటూ శ్రీశైలం వచ్చే భక్తులను నమ్మిస్తారు. మీకు కావాలంటే తక్కువకే అందిస్తామంటూ ఆఫర్లు ఇస్తారు. ఏ సొరకాయలో ఏముందో అనుకునే భక్తులు కొందరు వీటిని కొనే అవకాశం కూడా ఉంది. భక్తుల ఆర్థిక స్థోమతను బట్టి ఏకంగా రూ.కోటి, రూ.2కోట్ల వరకు కూడా ఒక్కో సొరకాయను విక్రయిచినట్టు పోలీసులు తెలిపారు.

ఆత్మకూరు ఎస్ఐ నాగేంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ‘నాగస్వరంలా ఉండే సొరకాయల మీద తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. చాలా మంది ఇవి కేవలం నల్లమలలోనే పెరుగుతాయని భావిస్తారు. అలాంటి సొరకాయ ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. కానీ, అవేవీ నిజం కాదు.’ అని ఎస్ఐ నాగేంద్ర చెప్పారు. ఒక్కో సొరకాయను రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు కూడా నిందితులు విక్రయించినట్టు ఆయన తెలిపారు.

ఈ నాగ సొరకాయ పేరుతో మోసంలో మొత్తం 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. వారు శ్రీశైలంలో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. వారిలో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. నిందితులపై సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు.

ఖమ్మం జిల్లాలో పురాతన నాణేల పేరిట మోసంఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూడా కొందరు ఇలాగే ప్రజల నమ్మకాలను ఆధారంగా చేసుకుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పురాతన నాణేల పేరిట జనంపై వల విసురుతున్నారు. ఎప్పుడో పాత కాలంనాటి నాణేలంటూ నమ్మబలికి వాటిని ఇంట్లో పెట్టుకుంటే మహర్దశ పడుతుందని నమ్మిస్తున్నారు. దీనికోసం రకరకాల దేవుళ్లు.. దేవతల బొమ్మలను ముద్రించిన రాగి నాణేలను.. అప్పట్లో మనదేశాన్ని పాలించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరిట ముద్రించిన నాణేలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. దీనికోసం చదువు పెద్దగా లేని, కొద్దిశాతం అమాయకత్వం ఎక్కువగా ఉండే ఏజెన్సీ వాసులను టార్గెట్‌ చేసి వల విసురుతున్నారు. ఈ మధ్య కాలంలో భద్రాచలం, దుమ్ముగూడెం, బూర్గంపాడు, మణుగూరుల్లో ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0