సౌర.. పవన విద్యుత్ పీపీఏలలో మరో జగన్మాయ.. మండిపడ్డ టీడీపీ

ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్న సామెత జగన్మోహన్ రెడ్డిని చూసే పుట్టి ఉంటుంది అంటున్నది టీడీపీ. సౌర, పవన విద్యుత్ పీపీఏ ల మీద జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ పోలిట్ బ్యూరో మండిపడింది.
ఆంధ్రప్రదేశ్ లో సౌర.. పవన్ విద్యుత్ పీపీఏ లలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలపై టీడీపీ పొలిట్ బ్యూరో మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు మీడియాకు విడుదల చేసిన ప్రకటన యధాతథంగా… ‘ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్న సామెత జగన్మోహన్ రెడ్డిని చూసే పుట్టి ఉంటుంది. సౌర, పవన విద్యుత్ పీపీఏలకు సంబంధించి జగన్ ప్రభుత్వం నవంబర్ 7, 2020 న విడుదల చేసిన జీవో ఎంఎస్ 25 ఇందుకు సరిగ్గా పరిపోతుంది. అధికారం చేపట్టిన మొదటి నెలలోనే విద్యుత్ రంగంలో ముఖ్యంగా సోలార్ పవర్ లో భారీగా అవకతవకలు జరిగాయని ప్రచారం చేశారో వాటినే ఇప్పుడు జి.ఓ నం 25 లో పొందుపరిచారు. నాడు అగ్రిమెంట్లు అన్ని నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గైడ్ లైన్స్ ప్రకారమే ఉన్నాయని.. అందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ ఎంత చెప్పినా వినలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడారు.
ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం అయితే మరో అడుగు ముందుకేసి మరీ 25 ఏళ్ల అగ్రిమెంట్ పై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలా చేస్తే ప్రభుత్వ ఖజానాకు నష్టమని.. టెక్నాలజీ పెరిగేకొద్ది రేట్లు తగ్గుతాయి కానీ పెరుగుతాయా..? అంటూ గంటల కొద్దీ మీడియా ముందు వాపోయారు. కానీ సరిగ్గా సంవత్సరన్నర గడిచేసరికి ఏ అగ్రిమెంట్ వల్ల రాష్ట్రానికి నష్టం అన్నారో.. వాటికి మించిన రాయితీలతో 30 ఏళ్లకు కొత్త అగ్రిమెంట్ కి సిద్ధమయ్యారు. ఉత్పత్తి నిలిపేసినా కూడా పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారు. ఉత్పత్తి నిలిపివేసిన సమయంలో పరిహారం చెల్లించే సదుపాయం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఎవరి కోసం ఈ సదుపాయం పెట్టారు?.