స్వరూపానందపై జగన్ స్వామిభక్తి ..


ఈనెల 18వ తేదీన శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజు సందర్భంగా 23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలతో కానుకలు పంపాలన్న దేవాదాయశాఖ ఆదేశాలను టిడిపి నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్ఠ , లౌకిక విలువలను కాలరాస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలు గుప్పించారు. స్వరూపానంద పుట్టిన రోజు సందర్భంగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు . వైఎస్ జగన్ చేతిలో రాష్ట్ర పాలన..పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న చంద్రబాబు సీఎం జగన్ ఆదేశాలపై యనమల మండిపాటు సీఎం జగన్ ఆదేశాలపై యనమల మండిపాటు సీఎం జగన్ ఆదేశాలు దేవాలయాల పట్ల , స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ సనాతన సంప్రదాయాలకు వ్యతిరేకమని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు . జగన్ రెడ్డికి ప్రజల పట్ల ఉన్న భక్తి కన్నా తనతో హోమాలు చేయించిన స్వామి భక్తి శృతిమించింది అని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం స్వామి భక్తి కాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పెడ ధోరణికి, తింగర చేష్టలకు తాజా నిర్ణయం ప్రత్యక్ష ఉదాహరణ అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. సొంత నిధుల నుండి కానుకలివ్వండి .. ప్రజా ధనం నుండి కాదు సొంత నిధుల నుండి కానుకలివ్వండి .. ప్రజా ధనం నుండి కాదు తనతో హోమాలు చేయించిన స్వామిపట్ల జగన్ కు భక్తి ఉంటే సొంత నిధుల నుంచి కానుకలు ఇవ్వాలి కానీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదంటూ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఓ ప్రైవేటు పీఠం ముందు మోకరిల్లేలా చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు నచ్చిన వారి కోసం అధికార దుర్వినియోగం చేయడానికి కాదని విమర్శించారు. జగన్ రెడ్డి ఆదేశాలు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డారు. రాష్ట్రంలో మిగతా స్వామీజీలను కించపరచటమే రాష్ట్రంలో మిగతా స్వామీజీలను కించపరచటమే రాష్ట్రంలో ఉన్న ఇతర స్వామీజీల పుట్టినరోజులకు లేని ఆలయ మర్యాదలు స్వరూపానందకి ఇవ్వడం ఇతర స్వామీజీలను పీఠాలను కించపరచడమేనని యనమల రామకృష్ణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి రాష్ట్రానికి గడ్డుకాలం దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల, రాష్ట్రాన్ని వివాదాల సుడిగుండంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. రోజుకో వివాదాస్పద ఆదేశాలను ఇస్తున్న సీఎం జగన్ కు ఏం చేయాలో తెలియదని, ఎవరైనా చెప్పినా వినడని ఫైర్ అయ్యారు. ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్య ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్య తింగరి మనస్తత్వంతో రాష్ట్రాన్ని తిమిరంలోకి నెడుతున్నారని మండిపడ్డారు యనమల రామకృష్ణుడు. ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలకు పాల్పడడం హేయమని యనమల పేర్కొన్నారు. ఇలాంటి దుందుడుకు నిర్ణయాలకు జగన్ రెడ్డి స్వస్తి చెప్పాలన్నారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని యనమల రామకృష్ణుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్వామి భక్తి కోసం రాష్ట్ర ప్రతిష్టని పణంగా పెట్టడం మంచిది కాదని హితవు పలికారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0