హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి… కరాచీలో వీఐపీ

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ప్రస్తుతం కరాచీలో ఉన్నాడని, అక్కడ వీఐపీ హోదా అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితి ఫైనాన్షియన్ యాక్షన్ టాస్క్ పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) నిర్ధారించినట్లు ఒక కథనం .
కర్ణాటకకు చెందిన భత్కల్ నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)లో సభ్యుడు. తన సోదరులతో కలిసి ఇండియన్ ముజాహిదీన్ సంస్థను స్థాపించి హైదరాబాద్‌లో పేలుళ్లు జరపడమే కాక, దేశంలోని పలు ప్రాంతాలలో విధ్వంసానికి కుట్రపన్నాడు.
అయితే పాకిస్తాన్‌పై ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షలకు కారణమైన 20మంది ఉగ్రవాదుల్లో రియాజ్ భత్కల్ కూడా ఒకడు. హింసను ప్రేరేపించే వీరందరికీ ఆశ్రయం ఇస్తున్నందున ఎఫ్ఏటీఎఫ్ ఇప్పటికే పాకిస్థాన్‌ను ‘గ్రే’ లిస్టులో పెట్టింది.
ఈ ఉగ్రవాదులకు సహకరించడం మానేయాలని ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను ఇప్పటికే హెచ్చరించింది. లేదంటే జూన్‌లో జరిగే ప్లీనరీలో బ్లాక్‌లిస్టులో చేరుస్తామని తేల్చి చెప్పింది.