2022లో జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలన్న టీడీపీ అధినేత

2022లో లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు జమిలి ఎన్నికలు జరుగుతాయని.. అందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారని సాక్షి కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు.

చంద్రబాబు ఏమన్నారో పత్రిక ఆయన మాటల్లోనే పాయింట్ల వారీగా వివరించింది:

కరోనా పోయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలందరిని కలిసి కష్టాలను తీర్చేందుకు నడుం బిగిస్తా.
పార్టీకి కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది. పార్టీలో కమిటీలన్నింటిని పూర్తిచేస్తున్నాం. యువతకు ప్రాధాన్యమిస్తున్నాం. సమర్థమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తున్నాం.
పార్టీలో కష్టపడి పనిచేసేవారికి పెద్దపీట వేస్తాం. నూతన నాయకత్వాన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే తెలంగాణ కేబినెట్‌ అంతా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.
టీడీపీ నాయకులను తీసుకుని మనపైనే విమర్శలు చేయిస్తున్నారు.
ఉపాధి హామీ పథకం బిల్లుల బకాయిలు 24 శాతం వడ్డీతో ఇప్పించే బాధ్యత నాది.
ఏడాదిన్నరపాటు నామీద అనేక ఆరోపణలు చేశారు. కొండను తవ్వి ఎలుక వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్‌ నేడు చేతగాని పాలనతో చేతులెత్తేశారు.
కోర్టులపైనే ఇష్టానుసారంగా జగన్‌ వర్గం వ్యాఖ్యలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు, లా అండ్‌ అర్డర్‌ ఎక్కడ తప్పినా కోర్టులు కలుగజేసుకుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. మేము లేకపోతే దేశంలో అరాచకం వస్తుందని హైకోర్టు చెప్పింది.
దేశంలో మహిళలపై ఎక్కువ దాడులు ఏపీలో జరగటం జగన్‌ రాక్షస పాలనకు అద్దం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares