AP High Court: న్యాయ మూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు CBIకి బదిలీ…


ఈ కేసును సీబీఐ వంటి విచారణ సంస్థకుకు ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఐడీకి ఉన్న అభ్యంతరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

న్యాయమూర్తులపై సోషల్‌ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు విచారణపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఐడీ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, 8 వారాల్లోపు నివేదిక ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం, నేతలపై ఎవరైనా వ్యక్తులు అభ్యంతరకర పోస్టింగులు పెట్టిన వెంటనే సీఐడీ స్పందిస్తోందని హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. అంతేకాదు న్యాయమూర్తులపై పోస్టింగుల వ్యవహారంలో హైకోర్టు అప్పటి రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉన్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. 19 మంది పేర్లతో ఫిర్యాదు చేస్తే, కేవలం 9 మంది పైనే కేసులు ఎందుకు నమోదుచేశారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ వంటి విచారణ సంస్థకుకు ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఐడీకి ఉన్న అభ్యంతరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవ్యవస్థను కాపాడేందుకు సీబీఐ తరహా సంస్థకు సాంకేతిక పరిజ్ఞానం, తగిన వనరులు, విభాగాలు, సిబ్బంది ఎక్కువ ఉన్నాయని తెలిపింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ దర్యాప్తును మరో విచారణ సంస్థకు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0